మహిళలతో పాటు మగవాళ్లకూ తప్పని వేధింపులు.. టీసీఎస్ లో దారుణాలు
- మతం మార్చుకోవాలని ఒత్తిడి.. వినకుంటే పనిభారం
- పిల్లలు కలగని ఓ యువ ఉద్యోగితో అసభ్యకరమైన మాటలు
- మీడియా ముందు వెల్లడించిన బాధితుడు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతమార్పిడి ప్రయత్నాలకు సంబంధించిన వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు తమ అధికారాన్ని ఉపయోగించుకుని మహిళా ఉద్యోగులను మాత్రమే కాదు, పురుష ఉద్యోగులను కూడా మానసికంగా హింసించారని, బలవంతపు మత మార్పిడులకు ఒత్తిడి చేశారని బయటపడింది. తాజాగా ఒక పురుష ఉద్యోగి తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను బయటపెట్టారు. తనతో బలవంతంగా ‘స్కల్ క్యాప్’ (టోపీ) ధరింపజేసి, నమాజ్ చేయించారని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా, నిందితుల్లో ఒకరు తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ‘పిల్లలు కావాలంటే నీ భార్యను నా దగ్గరకు పంపు’ అని అన్నట్లు పేర్కొన్నారు.
తన టీమ్ లీడర్లు తనతో బలవంతంగా నమాజ్ చేయించారని, కల్మా చదివించారని, స్కల్ క్యాప్ ధరింపజేశారని ఆ బాధితుడు ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. వైద్య చికిత్స పొందుతున్నప్పటికీ తన భార్యకు పిల్లలు కలగడంలేదన్న విషయంపై నిందితులు ఎగతాళి చేస్తూ, అత్యంత దారుణమైన మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో తాను కంపెనీలో చేరగా.. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వేధింపులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. తన టీమ్ లీడర్ తౌసిఫ్ అక్తర్, సహోద్యోగి డానిష్ షేక్ తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు.
టీమ్ లీడర్ గా ఉన్న తౌసిఫ్.. తన మాట వినేలా చేయడానికి ఇతరుల పనిని కూడా తనపై వేసి, శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా చేసేవాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదులపై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులను విచారించినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘటనలపై టీసీఎస్ యాజమాన్యం కూడా స్పందించింది. ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అంతర్గత విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించింది.